లేపాక్షి!

లేపాక్షి!

.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. 

ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం.

.

శ్రీ వీరభద్రస్వామి దేవాలయము - లేపాక్షి

రావణుని తో పోరాడిన జటాయువుని చూసి రాముడు "లే పక్షి" అన్నాడని అదే కాలక్రమేణా లేపాక్షి అయ్యింది అని అంటారు.


ఈ నాగలింగమునకు అభిముఖముగా కనబడే బసవేశ్వరుని విగ్రహం అత్యంత పెద్దది, మనోహరముగా ఉంటుంది. సుమారు 14 అడుగుల ఎత్తుతో ఉండే ఈ నందీశ్వరుడిని చూడటానికి కళ్ళు సరిపోవనిపిస్తుంది.

అత్యంత మనోహరముగా కనబడి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యములో ముంచెత్తే వ్రేలాడే స్తంభం. ఒక స్తంభమునకు 11 స్తంభముల ఆధారముతో డిజైన్ చేబడిన కళాకృతి. విజయనగర రాజుల నిర్మాణములోని వైభవం ఇక్కడ అనేక శిలలపై కనబడుతుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్న పాటకు Inspiration ప్రస్ఫుటముగా కనబడుతుంది. పెద్ద పెద్ద శిలలు ఇంకా శిల్పి వులి దెబ్బ కోసం కాచుకొని ఉండుట చూడవచ్చు.

ఇంకా సీతమ్మ వారి పాదాలు, ఇతర మండపాలు చూడదగినవి. లేపాక్షి గురించి చెప్పడానికి అక్కడ బోలెడంతమంది మార్గ దర్శకులు (గైడ్) ఉన్నారు. తెలుగు అర్ధమయ్యేవాళ్ళకి గుడి బయట 5 రూ./10 రూ. కి లేపాక్షి గురించిన చరిత్ర పుస్తకములు లభ్యమవుతుంది. అవి చదువుతూ ఆ ఆవరణ మొత్తం చూడడం వలన విజయనగర సామ్రాజ్యపు కళా ఔనత్యము చక్కగా అర్ధమవుతుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!