ఆది శంకరాచార్య భజగోవిందం - (130217)

ఆది శంకరాచార్య భజగోవిందం - (130217)

.

శ్లోకం - 3

నారీస్తనభర నాభీదేశం 

దృష్ట్వా మాగామోహావేశం |

ఏతన్మాంసవసాది వికారం

మనసి విచింతయ వారం వారం ||

.

శ్లోకం అర్ధం : స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. 

అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల 

వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

తాత్పర్యము : స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము. 

అందాలు అనుకొనే ఆ శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే. 

వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. 

ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి. 

దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము. 

సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. 

దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరిగినవి. కనుక, 

ఈ విషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గమునందు నడుద్దాము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!