"విరాజ మనోరంజనము".! (కనుపర్తి అబ్బయామాత్యుడు.)

"విరాజ మనోరంజనము".!
(కనుపర్తి అబ్బయామాత్యుడు.)
.
ఈ ప్రబంధములో శృంగారము స్థాయి రసము. తనకు వీలైన
ప్రతిసందర్భములో కవి శృంగారాన్ని చొప్పించాడు.
ఈ శృంగారము మొదట తారావిధుల సందర్భములోను,
పిమ్మట పార్వతీశంకరుల విషయములోను, తదుపరి
ఇలాకన్య బుధుల విషయములోను, అనంతరం ఊర్వశీ మిత్రావరణుల ఘట్టములోను, చివరగా నాయికా నాయకులైన ఊర్వశీ పురూరవుల సందర్భములోను పరిపూర్ణత నొందింది.
కవికి శృంగారం అంటే నల్లేరు మీద బండి నడక ఐనా కవి
మితం ఎరుగక పచ్చి శృంగారాన్ని వర్ణించాడు.
కవి ప్రథమ సమాగమాన్ని వర్ణించడంతో తనివి తీరక
గర్భధారణాన్ని, గర్భవతిని, గర్భవతి సంగమాన్ని,
బాలింతరాలితనమును, 'ప్రసవానంతర ద్వితీయ మాస సంగమాధిక సుఖము' ను కూడా వర్ణిస్తాడు. ఈ వర్ణనలు కొంత ఏవగింపును కలిగిస్తాయి.
మిగిలిన రసములు అక్కడక్కడ కనిపిస్తాయి..
.
ఈ కావ్యములో అబ్బనామాత్యుని శైలి మృదుపద గుంఫితమై, మిగుల ధారాళమై అలరారుతున్నది. ఈ గ్రంథంలో జాతీయాలను, లోకోక్తులను
విరివిగా వాడాడు.
.
కలుగదు కదా వివేకంబు కాముకులకు", "
.
వ్రతము చెడిన సుఖము దక్కగలదె",
.
"భార్యా రూపవతీ శతృః", "
.
ఉష్ణం ఉష్ణేన శీతలం" మొదలైనవి కొన్ని ఉదాహరణలు.
(వికీపీడియా నుండి సేకరణ )


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!