శ్రీరామ! నీ నామ మేమి రుచిర! .......

శ్రీరామ! నీ నామ మేమి రుచిర! ............రచన : ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం ..

.

తే.గీ.

తరతరములందు ధర్మకర్త లతి భక్తి

రామునకు వజ్రతిలకంబు రక్తినిచ్చి

మణుల, భూషణముల, మంచి మాన్యములకు

గుడికి నొసగిరి తమతమ కోర్కులెసగ.

తే.గీ

జానకీదేవి కా రీతి స్వచ్ఛ కాంచ

నాంగదములు, మౌక్తిక వజ్ర హారతతులు

కంకణంబులు, మకుటంబు, కింకిణీలు

సందిదండలు, కమ్మలు పొందు బడియె.

తే.గీ.

రామ సౌమిత్రులకు రమ్య రత్న ఖచిత

ముకుటములు, శృంఖములు, హారములు, ప్రశస్త

బాహుకీర్తుల వంటి ఆభరణచయము

వెలసె, మారుతి కట్టివే కలవు కొన్ని;

తే.గీ.

వెండి తాపిన ఉత్సవ విగ్రహములు

కంచు గరుడవాహనమును, కర్ర పల్ల

కీయు, ఇత్తడిపాత్రలు, గిరిగిటలును

ఉత్సవమునకు తగినన్ని యుండె గుడిని

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!