ఆటో వాడికీ మనసుంటుంది .... ...

ఆటో వాడికీ మనసుంటుంది .... ....................... ......

ఒక సారి హైదరాబాద్ నుంచి సికిందరాబాద్ కు ఆటో లో వెళుతున్నా..ముందే చెప్పాను కదా హైదరాబాద్ ఆటో వారిని నమ్మ వద్దు అనే ఆచారం పై నాకు పూర్తి నమ్మకం ఉంది. . కవాడిగూడ ప్రాంతం నుంచి వస్తున్నాను . అటునుంచి బన్సిలాల్ పేట స్మశాన వాటిక ముందునుంచి వెళితే బైబిల్ హౌస్ , సికింద్రాబాద్ వస్తుంది . ఆటో ఆతను అలాకాకుండా కనీసం ఒక కిలోమీటర్ దూరం పెరిగే విధంగా జీరా మీదుగా కింగ్స్ వే నుంచి సికింద్రాబాద్ కు వస్తున్నాడు....

ఆటోలో మా అమ్మకూడా ఉండడం తో ఆటో వాడి ని అలా ఎందుకు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావని నిలదిశా .. 

వాడు మీరు ఈ రూట్ లో రోజు వెళతారు కదా మీటర్ ఎంత అవుతుందో అంతే ఇవ్వండి దూరం పెరగడం వల్ల అదనంగా డబ్బు అవసరం లేదని చెప్పాడు.

నాకు రూట్ తెలుసు కాబట్టి దారికి వచ్చావు తెలయక పొతే మోసం చేసేవాడివే కదా అని ప్రశ్నించా .. ఎదుటి వాడిని నిలదీయడం లో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు ..సాధారణంగా ఆటో డ్రైవర్స్ వాళ్ల డ్రైవింగ్ లానే రాష్ గా ఉంటారు కాని ఆతను మాత్రం నిర్వికారంగా ఉన్నాడు . బహుశా అందువల్లనేమో నా ఉపన్యాసం ఎలాంటి అడ్డు లేకుండా సాగింది.

నా ఉపన్యాసం ముగిశాక అతను మెల్లగా మిమ్ములను మోసం చేయాలని కాదు. స్మశాన వాటిక ముందు నుంచి వెళ్ళడానికి మనసొప్పడం లేదు . ఈ మద్యనే నా భార్య చనిపోయింది. అక్కడే అంత్యక్రియలు జరిగాయి అటునుంచి వెళితే అన్నీ గుర్తుకు వస్తాయని ఇటునుంచి వచ్చా అని అతను చెప్పగానే నా నమ్మకం పై బలంగా కొట్టినట్టు అనిపించి , తమాయించుకొని నిలబడ్డా. ..

Courtesy,,,,అమృతమథనం...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!