"వూయలూగిన ఎంకి "

"వూయలూగిన ఎంకి "


ఎంకి వంపుల్లోన

ఏముందో గానీ 

ఎంకి ఊసెత్తితే 

ఏటేదో అవుతాది !!


కోతకోచ్చీన

చేనులా  

కదిలి 

తానోచ్చింది 


కంకులా 

రవళోలె 

కిలాకిలా

నవ్వింది 


సందాల 

సక్కంగ 

సద్దట్టుకొస్తాను !

మాపటికి 

మురిపెంగ ,

వూయాల 

లూగుదాం !! 


చెరుకు 

తోటన్తాను

సరిచేసి 

ఎదురాడు !!


ఏగిరం 

వస్తనని,

ఎగిరెగిరి, 

పోయింది !!


తాటి చెట్టుకి 

నే కొలతేసి చూసి ,

తాడునే పేనేసి  ,

బిగదీసి చూసి, 

మర్రి కొమ్మక్కి ..మరీ , 

వుయాల కట్టాను 

ఎంకొచ్చే దారంట,

ఎర్రిగా  చూసాను !! 


సందేల నా ఎంకి 

సక్కంగ వచ్చింది !

సుక్క సీరా కట్టి 

సిగ పూలు బెట్టీ !


వూయాల     

సూసింది 

ఉప్పెనై 

నవ్వింది !!


"వోయలంటె నీకు 

తోయలే మావా" ని 

'వరి' కంకిలా వంగి 

చెవులు 'కోరికేసింది'


'వూయలేక్కీ' తా 

'వెల్లువై' ఊగింది 

ఎర్రి మొగమేసుకూ  

తెల్లబోయాను' 

'ఎర్రి' మొగమేసుకూ,

'తెల్లబోయాను'......................................డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ .18/08/2014 .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!