"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః"

అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు.

"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు 

ఇది ప్రమాణం. 

సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు. 

ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి. 

ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము.

.

ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి|| 2-17 ||

.

ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు. 

ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము. 

వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము (gravitational field) అనవచ్చును,

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!