ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ

ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ

మహాభారతంలోని కుంతీ దేవి పాత్ర చాలా చాలా గొప్పది. మొత్తం మహాభారత కథ కుంతీ దేవి చుట్టూ నడుస్తుందని కూడా చెప్పవచ్చు.. 

దుర్వాసమునికి చేసిన శశ్రూషలకు మెచ్చి ముని కుంతీ దేవికి ఒక వరమిస్తాడు... అది ఏమిటంటే తన ఇష్టమైన దైవ అనుగ్రహంతో కన్యత్వానికి భంగం కలుగకుండా కుమారుడిని పొందగలిగే మంత్రం.. 

ఒక రోజు ఈ మంత్ర ప్రభావం ఎలాఉందో పరీక్షించదలచి మంత్రం జపించి సూర్యదేవుని వేడుకుని.. సూర్యుని అనుగ్రహం వలన కర్ణుడిని పొందుతుంది... అప్పటికి కుంతీ దేవికి వివాహం కాదు.. అందువలన కన్యాగర్భం తనకు అవమానాలను మిగిలుస్తుందని భయపడి.. సహజకవచకుండలాలతో జన్మించిన కర్ణుడిని ఒక పెద్ద పెట్టెలో ఉంచి రత్న, మణిమాణిక్యాలతో గంగానదిలో వదిలివేస్తుంది..

చివరికి యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు.. 

యుద్ధంలో మరణించిన వారికి ధృతరాష్ట్రుడు.. ధర్మరాజు ఎవరికి సంబంధించిన వారు తమ వారికి పిండప్రథానాలు చేస్తే కర్ణుడికి ఎవరూ పిండప్రధానం చేయరు.. ఇందుకు కూడా కుంతి చాలా దుఃఖిస్తుంది.. అప్పుడు ధర్మరాజు ముందు బయట పడుతుంది కర్ణుడు తన కుమారుడని.. 

జరిగిన అన్ని అనర్థాలకు బాధపడిన ధర్మరాజు.. ఆడవారి నోటిలో ఏ రహస్యందాగదని.. చివరికి నువ్వుగింజనానినంత సమయం కూడా పట్టకూడదని శాపమిస్తాడు.. 

ఒక విధంగా కుంతీ దేవికి/ఆడవారికి కూడా ఇది శాపమని చెప్పవచ్చు..

కుంతీ దేవి వలన మొత్తం యావత్ ఆడవారికి ఈ శాపం వచ్చింది.. 

మన యువతరానికి ముఖ్యంగా అమ్మాయిలకు కుంతీ దేవి చరిత్ర/మహాభారత కథను చెప్పవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.. 

వేలంటైన్ డేలు, డేటింగులు లాంటిదినాలతో వచ్చే అనర్థాలు..వాటి దుష్ప్రభావాల గురించి మనకు కుంతీ దేవి కథ ద్వారా మహాభారతం హెచ్చరించిందని చెప్పవచ్చు... ఈ డేటింగులు/వేలంటైన్ డేలు మనసంస్కృతి కాదు.. —

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!