వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం... .

వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం...

.

‪#‎గణేశ‬ చతుర్థీ రోజున నూనె తగలని వంట చేసి, గణపతికి నివేదన చేసి భోజనం చేయాలంటోంది #

.

ఇది దక్షిణాయనం, వర్షాకాలం. సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరించడంతో మనలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. అరుగుదల, ఆకలి మందగిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, మలబద్దకం పెరుగుతుంది.

.‪#‎గణపతి‬ ఇష్టమైనవి కుడుములు. కుడుములు ఆవిరి మీద ఉడికించి తయారుచేస్తారు. #

.

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలడానికి ఒకానొక ముఖ్యకారణం ఆహారం. ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రావణంలో కొద్దిగా పసుపు కలిగిన నీటిలో నానబెట్టిన శెనగలను మొలకెత్తాక స్వీకరిస్తారు. ఇది శ్రావణమాసానికి తగిన ఆహారం కాగా, ఈ భాధ్రప్రదమాసంలో ఉడికించిన ఆహారం అత్యంత శ్రేష్టం, ఆరోగ్యకరం. అందుకే మన పెద్దలు ఈ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం అయితే మహాశ్రేష్టమని, ఆరోగ్య ప్రదాయకమని గుర్తించి గణపతికి కుడుములు సమర్పించమన్నారు. 

గణపతి చవితి ఒక రోజు ముందు వచ్చే ఉండ్రాళ్ళ తద్దే నుంచి గణపతి నవరాత్రులలో ప్రతి రోజు ఈ కుడుములు భుజించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

.

‪#‎అందుకే‬ మన వినాయక చవితి రోజు స్వామికి నేతితో చేసిన వంటకాలు, కుడుములు సమర్పిస్తాం. గణపతి 21 సంఖ్య ఇష్టం కనుక వీలైతే 21 సంఖ్యలో కుడుములు / ఉండ్రాళ్ళు సమర్పించండి.

ఓం గం గణపతయే నమః......

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!