ప్రధమ దివసే


ప్రధమ దివసే
ఆషాఢం వచ్చేసిందన్నారు...నూతన వధూవరులు ఒక చోట వుండొద్దన్నారుఅందుకని బామ్మ యిల్లు సెంటరు....బామ్మలు తిన్నగా వుండరు కదా..అన్నీకూపీలు.....
నీళ్ళోసుకొన్నావటే మనమరాలా?....మనమరాలి చేతికి గోరింటాకు పెడుతూ అడిగింది బామ్మ.......
అదేమిటే బామ్మా! ప్రొద్దుటే పోసుకున్నాగా? అందిమనమరాలు...
అది కాదే...పెళ్ళై నాలుగు నెలలయ్యింది కదా ... ఓ నలుసునికని పారేస్తే నాకూ కాలక్షేపం కదా. ఎందుకు ఆలస్యం? అంది బామ్మగారు.
నాఆలస్యం యేమీ లేదు..మీ మనమడ్ని అడుగు...అని లోపలకి తుర్రుమంది ఆకొంటె పిల్ల.
బజారుకు రమ్మన్నాడు పెళ్ళాన్నీ మనుమడు. వెళ్ళవే..మీ ఆయనహుకుమ్ జారీచేసాడు...
మనమరాలు గబ గబా వచ్చింది....యెక్కు అన్నాడు.స్కూటర్ యెక్కింది.....
నడుం పట్టుకోమని బామ్మ సైగ చేసింది....అమాయకంగాపొట్టచుట్టూ చేయి వేసి...మొగుడ్ని కరచుకుంది గడుసుగా. ఇంటికొచ్చారు కొత్త దంపతులు. తెలిసింది కడుపు పండిందని.......
మనుమరాలికి కాదు....మనుమరాలిమొగుడుకి......
అమ్మాయి చేతిలో పండిన గోరింటాకు ఫకాలుమని నవ్వింది.......

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!