జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి.



~ మే 15,2013, బుధవారం, వైశాఖ శుద్ధ పంచమి,
జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~ హిందూ/భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు.

~ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2522 సంవత్సరాల క్రితం, 509 BC లో వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో కాలిడి గ్రామంలో శివ గురువు, ఆర్యాంబ దంపతులకు బిడ్డగా, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు.

~ చిన్న వయసులోనే వేదాలను, Philosophy, Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలను చదివేశారు. 8 ఏళ్ళ వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు.

~ తన వాదన ప్రతిభతో బౌద్ధ, జైన మతాలను అనుసరించే రాజుల వద్దకు వెళ్ళి, చర్చలు నిర్వహించి, తాను ఒక్కడే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన అనేక మంది పండితులతో శాస్త్రీయంగా వాదించి, వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు. యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవికావు.

~ ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి 477 BC లో మహనిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజలలో శుచిశుభ్ర్త తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవాత విగ్రహాల శక్తిని ఇటువంటి మానవసమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు.

~ వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసేవిధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను స్థాపించారు. ఎప్పుడొ 2490 సంవత్సరాల క్రితం ఈయన ఏర్పాటు చేసిన పరంపర ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.
జయ జయ శంకర! హర హర శంకర!!
(Tks:Eco vinayaka)

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!