..శ్రీకాళహస్తీశ్వర శతకము.

సంతోషించితి చాలుచాలు రతిరా / జద్వార సౌఖ్యంబులన్
శాంతిన్ బొందితి చాలుచాలు బహురా / జద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందెద జూపు బ్రహ్మపదరా / జద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే / శ్రీకాళహస్తీశ్వరా!

ధూర్జటీ .....శ్రీకాళహస్తీశ్వర శతకము.

శ్రీకాళహస్తీశ్వరా!నేణు రతీ కేళీ విలాసములను ఎన్నో అనుభవించితిని.వానివలన సంతోషమును పొందితిని,ఆ సుఖము చాలును.అనేక రాజుల సభలలో గౌరవములను పొంది దాని ద్వారా అనేక సౌఖ్యములను అనుభవించినాను. ఆ సుఖములు కూడా ఇంక నాకు వద్దు.నీ దయను నాపై ప్రసరింపచేయుము.దానితో ఏ ఇతర ఆసక్తులు లేక నిశ్చింతగా పరబ్రహ్మ పదమును చేరే మార్గానికి నన్ను చేర్చుము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!