అన్నమయ్య

 .

.


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను


పొలసి యారగించే పొద్దాయే నిపుడు||




వెన్నలారగించ బోయి వీధులలో తిరిగేనో


ఎన్నరాని యమునలో యీదు లాడేనో


సన్నల సాందీపనితో చదువగ బోయినాడో 


చిన్న వాడాకలిగొనె చెలులాల యిపుడు || పిలువరే 




మగువల కాగిళ్ళమరచి నిద్దిరించేనో 


సొగిసి యావులగాచే చోట నున్నాడో 


ఎగువన వుట్లకెక్కి యింతులకు చిక్కినాడో 


సగము వేడి కూరలు చల్లనాయె నిపుడు || పిలువరే 




చెంది నెమలిచుంగుల సింగారించుకోనీనో 


యిందునే దేవరవలె ఇంట నున్నాడో 


అందపు శ్రీ వెంకటేశు డాడివచ్చె నిదె వీడే 


విందుల మా పొత్తుకు రా వేళాయె నిపుడు || పిలువరే 











(అన్నమయ్య)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!