కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి .

శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ
విక్రమ మేమని పొగడుదురు
నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!

కృష్ణ శతకము.

కృష్ణా!అర్జునుడు భీష్మునితో యుద్దము చేయుచుండగా ఆ భీష్ముని దాటికి అతడోర్వలేని సమయమున నీవు చక్రమునుబట్టి భీష్ముని చంపుటకై పోవు నీవు,చూపిన పరాక్రమము నాకు వర్ణించుట నలవికాదు.

పోతనామాత్యుడు ఈ విదముగా వర్ణించారు..
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల గప్పికొనగ
నురికిన నోర్వక యుదరంబులో నున్న
జగముల వ్రేగున జగతి గదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున
బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపు మని క్రీడి మరల దిగువ.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!