.శ్రీకాళహస్తీశ్వర శతకము.


శ్రీకాళహస్తీశ్వర శతకము !

(ధూర్జటి..)



నిను సేవింపగ నాపదల్పొడమనీ, / నిత్యోత్సవంబబ్బనీ


జనమాత్రుండననీ మహాత్ముడననీ / సంసార మోహంబు పై

కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ / కుందింపనీ,మేలు వ

చ్చిన రానీ యవి నాకు భూషణములే / శ్రీకాళహస్తీశ్వరా!


.




శ్రీకాళహస్తీశ్వరా!


నీకు సేవలు చేయు సందర్భములో నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము లేక మేలు జరిగి అన్ని వేళాలయందు నీకు వేడుకలు జరుగనిమ్ము.సామాన్య మానవుడని అందరూ అననిమ్ము.లేక నన్ను మహాత్ముడని ప్రశంసించనిమ్ము,సంసార సముద్రములో మోహాదులు కలిగితే కలుగనీ,జ్ఞానము

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!