'అంకముఁ జేరి శైలతనయా ......

'అంకముఁ జేరి శైలతనయా స్తనదుగ్ధము లానువేళ బా 

ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్ గబళింపఁబోయి యా 

వంకఁ గుచంబుఁ గాన కహివల్లభు హారముఁ గాంచి వే మృణా 

ళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్.'

(మనుచరిత్ర....అల్లసాని )


Satyanarayana Piska వారి వివరణ.


గణపతిదేవుణ్ణి ఎందరో కవులు ఎన్నెన్ని విధాలుగానో ప్రస్తుతించారు. ఐతే, ఈ పద్యంలో చిత్రించినట్టుగా ' బాలవినాయకుడు ' బహుశా మరెక్కడా ప్రత్యక్షమవలేదేమో! ఇందులో కవి అత్యంత రమణీయంగా ఆ గిరిజాతనయుణ్ణి మన కన్నులకు కట్టినట్టుగా చూపించాడు.


పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవి తన గారాల కుమారుడైన చిన్నివినాయకుడికి స్తన్యం ఇవ్వాలని ఒళ్ళోకి తీసుకుంది. పాలు తాగుతున్న ఆ అల్లరిపిల్లాడు కుదురుగా ఉండకుండా తన తొండముతో అవతలివైపున్న రెండో కుచమును అందుకోడానికి ప్రయత్నించాడు. (ఇది చాలా సహజమైన బాల్యచేష్ట! తల్లిపాలు తాగుతున్న పసిపిల్లలను కాసింత పరిశీలనగా పరికిస్తే ఈ దృశ్యాన్ని ఈనాటికీ మన ఇళ్ళల్లో దర్శించవచ్చు)....ఐతే, ఆ వైపున అమ్మగారి రెండవ స్తనం లేదట! పైపెచ్చు, నాగేంద్రహారం ఉందట ఆ చోట! సహృదయ పాఠకులు ఈపాటికి కనిపెట్టే ఉంటారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!