భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:

భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:


యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం

తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః

యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం

తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః


తాత్పర్యం: కొద్దిపాటి జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నప్పుడు మదగజం లాగా మదించి నేనే సర్వజ్ఞుణ్ణని 

భావించినాను. తరువాత మెధావంతులైన పెద్దలవల్ల కొద్దికొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత నాకేమీ తెలియదనీ, మూర్ఖుణ్ణనీ భావిస్తూ పూర్వపు గర్వాన్ని వదలి సుఖంగా ఉన్నాను.


వివరణ: ఒక పండితుడు ఈ పద్యం లో తన అనుభవాన్ని వివరిస్తున్నాడు.

"అల్పో విద్యో మహాగర్వీ" అనే న్యాయానుసారం కొద్దిగా చదువుకున్న వాడికి గర్వమెక్కువగా ఉంటుంది. ఆ గర్వం తో వాడు సర్వజ్ఞుణ్ణని భావిస్తాడు. తర్వాత పండితుల వద్ద విద్యలను నేర్చుకుని కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత అతని వివేకం కలిగి అంతకు పూర్వపు గర్వం తొలగిపోయి ’నేను మూఢుణ్ణి, ఏమీ తెలియని వాడిని అని భావిస్తాడు’ వేమన కూడా ఇలాంటివాళ్ళ గురించే 


"అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను

సజ్జనుండు పల్కు చల్లగాను

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా" - అని అన్నాడు

ఎవడు అల్పజ్ఞ్నుడైనా తనను సర్వజ్ఞుడని భావిస్తాడో వాడు మూర్ఖుడనీ, ఎవడు సర్వజ్ఞుడైనా తనను మూఢుణ్ణి గా భావిస్తాడో వాడు విద్వాంసుడనీ తాత్పర్యం.



గమనిక: పైన తాత్పర్యం నాకు గ్ర్తుకు ఉన్నంతలో రాసినది. దాని క్రింద ఉన్న "వివరణ" ఆచార్య రవ్వా శ్రీహరి గారి "బర్తృహరి నీతిశతకము - దీపికా వ్యాఖ్యాసహితం" అను పుస్తకం లోనిది. మిగతా చదువరుల సౌలభ్యం కోసం ఇక్కడ ఉంచడం జరిగింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!