కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!
.jpg)
అరయన్ శంతను పుత్రుపై విదురుపై నకౄరుపై కుబ్జ పై
ReplyDeleteనరుపై ద్రౌపది పై కుచేలుని పయిన్ నంద వ్రజ శ్రేణిపై
పరగన్ గల్గు భవత్కృపా రసము నా పై కొంత రానిమ్ము నీ
చరణాబ్జంబులె నమ్మినాను జగదీశా ! కృష్ణ ! భక్త ప్రియా !- ఈపద్యం భాగవతంలో ఏ ఘట్టంలోనిదో దయచేసి చెప్పండి.
ఇది తిక్కన గారి పద్యమండీ
ReplyDelete