పింగళి, కాటూరి కవులకు ఒక విశిష్టస్థానం .


ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో పింగళి, కాటూరి కవులకు ఒక విశిష్టస్థానం ఉంది.

ఈ జంటకవుల పేరు వినగానే "సౌందరనందము" గుర్తుకు వస్తుంది. "గుడిగంటలు", "పౌలస్త్య హృదయము", "తొలకరి" మొదలైన వారి ఇతర రచనలు

ఆంధ్రభాషామతల్లికి అమూల్యాలంకారాలు. 


ఈ కవుల "తొలకరి" అనే కవితాసంకలనంలో, "రసాలము" అనే ఖండికలో -

కేవలం ఏడు పద్యాలున్నాయి. దానిలోని మహత్తర సందేశాన్ని మనం ఒకసారి మననం చేసుకుందాం. రసాలము అంటే మామిడిచెట్టు. దానినుంచి మనం అందుకోదగిన సందేశమేమిటో చెప్పారీకవులు. "తరువులు మనకు గురువులు" అన్నారు కదా పెద్దలు. 


మామిడి చెట్టును తోటవాకిటిలో నిలబడిన శోభనదేవతగా వీరు వర్ణించిన తీరు చూడండి -


"పరిణత సత్ఫలమ్ముల, సువానలీను సుమమ్ములన్, మనో 

హరమగు తేనెదొన్నెల, లతాంత రజమ్మను కుంకుమమ్ముఁబ 

ళ్ళెరమున నించి, చేతగొని లేనగవొప్పగఁదోట వాకిటన్ 

సురుచిర మూర్తితో నిలుచు శోభనదేవతవీవు భూజమా !"


"ఓవృక్షమా! పండిన పళ్ళు, సువానతో అలరారే పువ్వులు, తేనెదొన్నెలు, పుప్పొడి అనే కుంకుమ ఉన్న ఒక పళ్ళెం చేతులతో పట్టుకొని మనోహర రూపంతో, చిరునవ్వుతో తోట వాకిట – నిలచిన మంగళమూర్తివి నువ్వు" అని ప్రశంసించారు. ఈ కవితాత్మక వాక్యాలలో సమస్త సౌభాగ్యాలతో కళకళ లాడే ఒక స్త్రీ మూర్తి మన ఊహలో మెదలుతుంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!