సాంధ్యశ్రీ కరుణశ్రీ కవిత్వం


.

సాంధ్యశ్రీ !

(కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి .)

-

అంజన రేఖ వాల్కనుల యంచులదాటి మనోజ్ఞ మల్లికా

కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ

కంజ దళాక్షి, నీ ప్రణయ గానములో పులకింతునా మనో

రంజని బుష్పవృష్టి పయి రాల్పి నినున్ బులకింప జేతునా!

-

క్రొంజిగురాకు వేళుల కురుల్ తడియార్పుచు గూరుచున్న య

భ్యంజన మంగళాంగి జడలల్లుదునా, మకరంద మాధురీ

మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రపుల్ల పు

ష్పాంజలి జేసి నీ యడుగులందు సమర్పణ జేసికొందునా!

.

సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నా

రింజకు నీరు వోయు శశిరేఖవె నీవు సుభద్ర సూతినై

రంజిత పాణి పల్లవము రాయుదునా నిను మౌళి దాల్చి మృ

త్యుంజయ మూర్తినై జమునితో తొడ గొట్టి సవాలు చేతునా!

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!