నా సర్వం మీకే సమర్పితం’

‘అయితే సరే స్వామీ, మీరు నిజంగా తీసుకునేట్లయితే, అలా అడగండి. దక్షిణగా మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాను. మీరు అడగాలే కానీ నేను ఇవ్వనిదంటూ ఉండదు’ అన్నాడు.

‘అయితే సరే. అడుగుతున్నాను, ఇప్పుడు ఇవ్వు. ఏమిస్తావబ్బా?’ అంటూ ఆగాడు స్వామి.

‘ఏదైనా తీసుకోండి. నా సర్వం మీకే సమర్పితం’ అన్నాడు ఆ మనిషి.

‘అయితే నువ్వీ లోకంలో చేసిన పుణ్యమంతా నాకిచ్చెయ్’ అన్నాడు రమణుడు.

‘నేనేమీ పుణ్యం చేసుంటానండీ? నాకు ఒక్క సద్గుణమైనా లేందే?’ అన్నాడు అతడు.

‘అడిగినది ఇస్తానని వాగ్దానం చేశావు కదా? ఇప్పుడు నేను అడిగాను మరి ఇవ్వు. సద్గుణవంతుడివవునో కాదో, ఆ విషయం వదిలెయ్. నీవు గతంలో చేసిన పుణ్యమంతా ఇచ్చెయ్యమంటున్నాను, ఇవ్వు.’

‘అలాగే ఇస్తాను, స్వామీ. కానీ ఇవ్వడమెలాగ? ఎలా ఇవ్వాలో చెప్పండి. ఇచ్చేస్తాను’ అన్నాడు అతడు.

‘నోటితో మనస్ఫూర్తిగా ఇలా అనుఃనేనితః’క్రితం చేసిన పుణ్యమంతా గురువుకు అర్పిస్తున్నాను. ఇక ముందు ఆ పుణ్యఫలం యొక్క ఫలితమేదీ నాకు దక్కదు. అయినప్పటికీ అందుకై నేను చింతించను, అని హృదయపూర్వకంగా అను’ అన్నారు స్వామి.

‘అలాగే స్వామీ, నా జీవితంలో నేనేదైనా పుణ్యమనేది చేసి ఉంటే, ఆ పుణ్యమూ దాని ఫలితమూ అన్నీ కూడా మీకు సమర్పించుకుంటున్నాను. మీరు నా గురువు అయినందువల్ల, శిష్యుణ్ణి అలా ఇవ్వమని అడిగి నందువల్ల, సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ మొత్తం ఇచ్చేస్తున్నాను’ అన్నాడు.

భగవాన్ గంభీరమైన వదనంతో, ‘కానీ ఇది చాలదు’ అన్నారు కఠినంగా.

‘స్వామీ, మీరు అన్న విధంగా అడిగింది ఇచ్చేశాను. ఇవ్వడానికి నా వద్ద మరేమీ లేదు’ అన్నాడు ఏడుపు గొంతుతో. ‘అలా కాదు. నువ్వు చేసిన పాప ఫలితం అంతా కూడా ఇచ్చెయ్’ అన్నారు శ్రీమణులు.

ఆ మనిషి భగవాన్ వంక అమిత భయంతో చూచాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!