మెరుపు మెరిసింది ! . రావిశాస్త్రిగారి కధ...

మెరుపు మెరిసింది !

.

రావిశాస్త్రిగారి కధ...

.

మెరుపు మెరిసింది కథ లో నేపథ్యం వర్షం. 

పెళ్ళికాని యువతి నీరజ నిరాశామయమయిన జీవితానికి ప్రతీక వర్షం. 

వర్షంలో మెరిసే మెరుపులు ఆమె ఆశలు. ఆమె పొందాలనుకున్న జీవితానందానికి ప్రతీకలు. చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి వీల్లేకుండా వర్షం ఆటంకం కలిగిస్తే ఒక యువకుడు ఆమెని తన కారులో గమ్యానికి చేరుస్తాడు. 

అప్పుడు ఆమెలో చెలరేగిన ఆశలని రచయిత ఇలా వర్ణిస్తారు. 

మబ్బుల్లోంచి 

వర్షంలోంచి

తలుపుల్లేని కిటికీలోంచి

చీకట్ని తోసేస్తూ మెరుపులు

ఒకమెరుపు,

ఒకటి మరొక మెరుపు 

రెండు మరో మెరుపు 

మూడు ఒకటీ రెండూ మూడు.

మరునాడు కూడా అదే యువకుడు తనను మళ్ళీ కారు ఎక్కించుకుంటాడని ఆశపడిన నీరజకి నిరాశ ఎదురయింది. 

అదో మెరుపు ఇదో మెరుపు 

మరో మెరుపు

ఒకటీ రెండూ మూడూ హాస్యాస్పదం నవ్విపోతారు 

అదిగో మెరుపు ఇదే మాయమయింది.

మళ్ళీ మెరిసింది మాయమయింది ఇంతే ఇది ఆఖరికిదే నిజం. 

ఈ చీకటే ఇదే ఈ చీకటే నిజం. ఆశనిరాశలకి ప్రతీకాత్మకంగా, మెరుపులు,

చీకటి మొదలయిన పదబంధాలతో సూచిస్తూ నీరజ పాత్రని కవితాత్మకంగా ఆవిష్కరించారు రావిశాస్త్రి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!