సంస్కృతం తరగతి !

సంస్కృతం తరగతి నడుస్తోంది

అధ్యాపకుడు విభక్తి , వచనములు వివరిస్తున్నాడు .

" రామ " శబ్దము ఉదాహరణగా తీసుకుందాం ... 

రామః .....రామౌ.... రామాః 

అంటే తెలుసుగదా , 

రాముడు .... (ఇద్దరు ) రాములు ......(అనేక) రాములు

సంస్కృతములో ఏక వచనము , బహువచనమే కాక , ద్వి వచనము కూడా ఉంటుంది.

దీన్నే ఇంకోలా ,

అహం రామః అస్మి -- నేను రాముడిని [ అయి ఉన్నాను ]

ఆవాం రామౌ స్వః --మేమిద్దరము రాములము [అయి ఉన్నాము]

వయం రామాః స్మః --మేము రాములము [అయి ఉన్నాము ]

అని చెప్పవచ్చు... అర్థం అయిందా..

అందరూ తలలాడించారు..

అధ్యాపకుడు :- ఏదీ , సుబ్బారావు , ఇంకో ఉదాహరణ చెప్పూ..

సుబ్బారావు :-

అహం బ్రహ్మః అస్మి [ అహం బ్రహ్మాస్మి ]

ఆవాం బ్రహ్మౌ స్వః 

వయం బ్రహ్మాః స్మః

అధ్యాపకుడు మూర్ఛపోయాడు. 

---------------

ఈ జోకు అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!