హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు?. .

హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు?.

.

హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ “అగ్ని” ని సాక్షిగా ఎందుకు పెడతారు అన్నది చాలా మంది దంపతులకు తెలీదు. 

మన సంస్కృతీ, సంప్రదాయాల్లో అగ్నిని పవిత్రంగా చూడడం ఆచారం. 

.

పూజలు, యజ్ఞయాగాదులు అగ్ని లేకుండా జరగవు.

.

అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మసమ్మతం కాదంటారు.

పెళ్ళీ డు వచ్చిన ఆడపిల్లలు చక్కగా చూడముచ్చటగా ఉంటారు. 

.

వివాహానికి యోగ్యమైన అమ్మాయిని చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా అగ్ని ఆమెను రక్షించగా అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు.

.

అందుకని “అగ్నిసాక్షిగా పెళ్లి ” అనే మాట వచ్చింది.

.

వేదాలలోని ప్రధమ శబ్దం అగ్ని, ఆ అగ్నిని ఋషులు గుర్తించి అగ్రస్వరూపునిగా కీర్తించారు.

“దారాధీన స్తథా స్వర్గః పిత్రూణా మా త్మన స్సహ “

.

అని పెద్దలంటారు. తన పితృలందరికీ స్వర్గం లభించాలంటే, ముందుకాలంలో తానూ తరించాలంటే అది సాధ్యమయ్యేది, భార్య కనబోయే సంతానం ద్వారా కదా! 

అలాంటి స్వర్గానికి తీసుకుపోగల అవకాశం బార్య ద్వారా లభిస్తుంటే ఆమెను గౌరవించాలి కదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!