మహానటి !

మహానటి !

.

అభినయానికి చిరునామా, నటి అనే పదానికి పర్యాయ పదం.

.

ప్రతీ పాత్రకు ప్రాణం పోసే అభినయ కౌసలం. వెరసి ఆమె వెండితెర రాణి.

.

మహానటిగా పేరు సంపాధించి అశేష వాహిన అభిమానులను సొంత చేసుకున్న

.

నట శిరోమణి మహానటి 'సావిత్రి'.

.

ఎన్ని తరాలు మారిన తెలుగు సినిమాల్లో ఆమె నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది.

ఆమె అభినయం, నటనలోని వైవిధ్యం చిత్ర రంగంలో తిరుగులేని నటిగా నిలబెట్టింది.!

,

.

మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. 

ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది.

చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది.

సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. 

ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది.

దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి.

ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!