||అవ్యక్తానుభూతి|

||అవ్యక్తానుభూతి|| సుధారాణి గుండవరపు||

.

నా చూపువు నీవై నిలచిన వేళ...

నా శ్వాసవు నీవై సాగిన వేళ...

నా తనువు ను తాకే స్పర్శవు నీవైన వేళ...

నా చెవులను చేరవచ్చిన సంగీతం నీవైన వేళ...

నా మాటల పాటలో పద పల్లవులు నీవైన వేళ...

ఈ నా ప్రకృతి తనని తాను మరచి నెమలి లా పురివిప్పి ఆడినట్లు...

వసంత కోకిల కోటిరాగాలు కూసినట్లు...

గ్రీష్మ తాపం చల్లార్చేందుకు శరదృతువులో స్వాతిచినుకులు కురిసినట్లు...

హేమంత తుషారపు జల్లులు పరచినట్లు...

అవ్యక్తానుభూతులు జీవనదులై పరవళ్ళు త్రొక్కుతున్నట్లు...

ఈ భావావేశం మాటల రూపం లో ఇలా అల్లుకుంటున్నాయి...

ఇవి నీవే...ఇది నీవే...

కర్తవు నీవే...

కర్మవు నీవే...

క్రియవు నీవే...

నేను సాక్షిని మాత్రమే...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!