మహాకవుల మహితోక్తి !

-" ఆనయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు"

మహాకవుల మహితోక్తి !

.

(ఆచార్య చొప్పకట్ల సత్యనారాయణ గారి విశ్లేషణ)

కం: కలనాటి ధనము అక్కర

గలనాటికి దాచ కమలగర్భుని వశమే? 

నెల నడిమినాటి వెన్నెలృ 

లవడునే గాదెవోయ, నమవశనిశికిన్!

.

ఉన్నప్పుడు అవసరాలు మానుకొని కూడబెడితే ,

రేపు అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుంది. అనిమామూలుగా అందరం అనుకుంటాం...ఆప్రకారం ెంతోకొంత మొత్తాన్ని దాచుకునేప్రయత్నం చేస్తూఉంటాం;

అదిగో అదివెర్రితనమేనంటాడు అల్లసాని పెద్దన. యేమో ? 

దాచుటేకష్టం ,ఒకవేళ దాచినా అదియక్కరకు వచ్చేది యనుమాానమే., 

పున్నమి నాటివెన్నెలను అనావాస్య రోజులలో (చీకటిరోజులలో) వాడుకుందామని

గాదెలోపోసి దాచగలమా? అంటాడు. నిజేమేగదా!

.

ఈ" అమవసనిశి" అనేప్రయోగం పెద్దన్నను కొంత యిబ్బందిపెట్టింది 

కొంటె రామకృష్ణుడు-

.

" ఎమితిని చెపితివి కపితనము 

బ్రమపడి వెఱిపుచ్చకయ్య వడిదిని సెపితో 

ఉమెతక్కయ దినిసెపితో 

యమవస నిశియన్నమాట యలసని పెద్దన!

.

అమవసనిశి- వ్యాకరణవిరుధ్ధ ప్రయోగనుు. అమావాస్యానిశా - అనిప్రయోగించాలి.

నాటికది విరుద్దప్రయోగమేయైనా నేటికి మరల సి.నారాయణరెడ్డి వంటి సాంప్రదాయ కవి ప్రయోగనునకు నోచుకొనుట గమనింప దగినది

.

.-" ఆనయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు"

.

అని 'శివరమజని' -లో నారాయణరెడ్డి గారి ప్రయోగం!

మొత్తానికి ఆప్రయోగ విషయం యెలాఉన్నా ధనంప్రయోజనం అనుభవమే!

దానాదులకో భోగాదులకో వినియోగించు కొనుట ఉత్తముల లక్షణ మంటాడు పెద్దన !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!