శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 25/4/17.

శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 25/4/17.

.

రాజుల్మత్తులు,వారిసేవ నరక ప్రాయంబు,వారిచ్చు నం

భోజాక్షీ చతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా

బీజంబుల్,తదపేక్ష చాలు,పరితృ ప్తి పొందితిన్,జ్ఞాన ల

క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము,దయతో శ్రీ కాళహస్తీశ్వరా!

.

శ్రీ కాళహస్తీశ్వరా!రాజులు మదముతో ప్రవర్తింతురు.

అందుచే వారికి సేవ చేయుట నరకముతో సమానమైనది.

వారిచ్చునట్టి స్త్రీలు ,పల్లకీలు,గుర్రాలు,ఆభరణాలు మనస్సునకు 

భాద కలిగించేవిగా ఉండును.కాన నాకు వాటిపై గల కోరిక చాలును.

సంతృప్తి పొందితిని దయతో మోక్షమునకు చేర్చు జ్ఞానమును నాకు ఇమ్ము.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.