తెలుగుదనము! (శ్రీ కామేశ్వర రావు భైరవభట్ల గారి పద్యం.)

తెలుగుదనము!

(శ్రీ కామేశ్వర రావు భైరవభట్ల గారి పద్యం.)

.

అలకలు నటియించి అటువైపు తిరిగిన

చెలి మోములోనున్న చిలిపిదనము.

.

బుజ్జి పాపాయిని పొత్తిళ్ళ లాలించు

అమ్మదనములోని కమ్మదనము

.

ఏరువాకల నాళ్ళ నిగురొత్తు వరిచాళ్ళ

జనపదమ్ములోని జానుదనము

.

వేసవి నడిరేయి వెన్నెల చిలికించు

నెలవంక నవ్వులో చలువదనము

.

కన్నె సరిగంచు పరికిణీ కలికిదనము

ఎంకిపాట పల్లవిలోని పెంకిదనము

.

కలిపి వడపోత పోసిన తెలుగుదనము!

తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!