ఋక్కులు.......మహాకవి శ్రీ శ్రీ .!

ఋక్కులు.......మహాకవి శ్రీ శ్రీ .!

.

కుక్కపిల్లా,

అగ్గిపుల్లా,

సబ్బు బిళ్ళా -

హీనంగా చూడకు దేన్నీ !

కవితా మయమేనోయి అన్నీ !

రొట్టె ముక్కా ,

అరటితొక్కా ,

బల్ల చెక్కా -

నీ వేపే చూస్తూ ఉంటాయ్ !

తమ లోతు కనుక్కోమంటాయ్ !

తలుపు గొళ్ళెం ,

హారతి పళ్ళెం ,

గుర్రపు కళ్ళెం -

కాదేదీ కవితకనర్హం !

ఔ నౌను శిల్పమనర్ఘం !

ఉండాలోయ్ కవితవేశం !

కానీవోయ్ రసనిర్దేశం !

దొరకదటోయ్ శోభాలేసం ?

కళ్లంటూ ఉంటే చూసి ,

వాక్కుంటే వ్రాసీ !

ప్రపంచమొక పద్మ వ్యూహం !

కవిత్వమొక తీరని దాహం !

( మహాప్రస్థానం - 1950 )

ఋక్కులు (14-04-1934 )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!