“శంకరాభరణం....నేపధ్య సంగీతం :!

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం 

.“శంకరాభరణం....నేపధ్య సంగీతం :!

.

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. 

నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే 

గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం.

నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత óá ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .

శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది

తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో”మానస సంచరరే ”పాట ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శ౦కర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విశ్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్తాఫలం.

.

(జయహో జంధ్యాల)

ఆ గుర్రపు డెక్కలచప్పుడు లో కూడా ఆయన కోపం వినపడుతోందమ్మో !

పురోహితుడికి నత్తి మనకి భక్తీ ఉండకూడదు (తులసి తల్లి).

నేను వయసులో ఉన్నప్పుడు మా ఊళ్ళో మొగాళ్ళెవరూ కాపరాలు చెయ్యలేదు ఆ రోజుల్లో (తులసి తల్లి).

ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమయిన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు తులసీ

ఆ లోకేశ్వరుడికి తప్ప లోకులకి భయపడనురా మాధవా (శంకరశాస్త్రి)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!