కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!

.

కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. 

ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.

(కొందరు అనుకునట్లు ఈ పాట శ్రీ శ్రీ రాసింది కాదు.)

పాటపల్లవి :

కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా

నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే

వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో || | | కారులో | |

చరణం 1 :

చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా

మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా

కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి

చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

నిలిచి విను నీ బడాయి చాలు

తెలుసుకో ఈ నిజానిజాలు

చరణం 2 :

గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా

జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా

చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు

చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

నిలిచి విను నీ బడాయి చాలు

తెలుసుకో ఈ నిజానిజాలు

వివరణ!

.

ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని 

ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం. 

మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని తెలియజేస్తుంది

ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను, దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా చెబుతాడు. చివరికి "చాకిరొకడిది సౌఖ్యమొకడిది" తెలుగుకోమని అంటాడు

.

ఈ పాట సినిమా కోసం వ్రాసింది కాదు.ఆత్రేయ గారు నెల్లూరు కస్తూరిదేవివిద్యాలయంలొ నటకలురీహార్సల్స చేయిస్తుండగా ఆ విద్యాలయానికి పట్టుపావడలు,పరికిణీలతొ నాజూకుగా రోజు జట్కాలలొ వస్తున్న అమ్మాయిల దుస్తులనుచూచి,తను వారంరోజులుగా వేసుకుంటున్న మాచిన మరియు చిరిగిన బట్టలతొ బేరీజు వేసుకొని ఈ పాట వ్రాసినట్లు ఆత్రేయ గారి సతీమణి పత్రికాముఖంగా తెలిపింది.ఈపాటను మొదట సంసారం చిత్రంలొ వాడుకోవాలనుకొని మానుకున్నారట. తోడికోడళ్ళు సినిమా తీస్తున్న సమయంలొఎవరొ ఈపాటను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరియు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి ద్రుష్టికి తీసుకువచ్చారట.సాహిత్యం బాగా నచ్చినదట,కాని మధుసూదనరావుగారు ఈ పాటతొ నిడివి ఎక్కువవుతుంది పైగా ఆపాటకు దగ్గ సన్నివేశం మన చిత్రంలొ లేదు వద్దుపొమ్మానడట.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మాత్రం సాహిత్యం చాలా బాగుంది, ఈపాట మనకు ప్లస్పాయింట్ అవుతుంది,ఈపాటకు సన్నివేశాన్ని నేను క్రియేట్ చేస్తాను నిడివికూడా పెరగకుండా నేను చూచుకుంటాను అని వప్పించి ఆపై పాటను రికార్డు చేయించి షూటింగు జరిపారు.

Comments

  1. ఈ పాట సినిమా కోసం వ్రాసింది కాదు.ఆత్రేయ గారు నెల్లూరు కస్తూరిదేవివిద్యాలయంలొ నటకలురీహార్సల్స చేయిస్తుండగా ఆ విద్యాలయానికి పట్టుపావడలు,పరికిణీలతొ నాజూకుగా రోజు జట్కాలలొ వస్తున్న అమ్మాయిల దుస్తులనుచూచి,తను వారంరోజులుగా వేసుకుంటున్న మాచిన మరియు చిరిగిన బట్టలతొ బేరీజు వేసుకొని ఈ పాట వ్రాసినట్లు ఆత్రేయ గారి సతీమణి పత్రికాముఖంగా తెలిపింది.ఈపాటను మొదట సంసారం చిత్రంలొ వాడుకోవాలనుకొని మానుకున్నారట. తోడికోడళ్ళు సినిమా తీస్తున్న సమయంలొఎవరొ ఈపాటను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరియు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి ద్రుష్టికి తీసుకువచ్చారట.సాహిత్యం బాగా నచ్చినదట,కాని మధుసూదనరావుగారు ఈ పాటతొ నిడివి ఎక్కువవుతుంది పైగా ఆపాటకు దగ్గ సన్నివేశం మన చిత్రంలొ లేదు వద్దుపొమ్మానడట.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మాత్రం సాహిత్యం చాలా బాగుంది, ఈపాట మనకు ప్లస్పాయింట్ అవుతుంది,ఈపాటకు సన్నివేశాన్ని నేను క్రియేట్ చేస్తాను నిడివికూడా పెరగకుండా నేను చూచుకుంటాను అని వప్పించి ఆపై పాటను రికార్డు చేయించి షూటింగు జరిపారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!