తమ్ముడు పీరబాబు డౌటుకి నా వివరణ...

శుభోదయం,!

.

తమ్ముడు పీరబాబు డౌటుకి నా వివరణ...

ఓ చోట కుదురుగా ఉండరు కాబట్టి నదులకి ఆడవారి పేరు - కూర్చున్న చోటు నుండి కదలరు కాబట్టి పర్వతాలకి మగాళ్ళ పేర్లూ పెట్టారు...

గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి భూమి అని స్త్రీ పేరు - తిరక్కుండా ఓచోట పడుంటాడు కాబట్టి సూర్యుడికి పురుషుడి పేరు పెట్టారు...

పాత కాలంలో వక్రీకరించబడిన శాస్త్రాల్లో మగాడు తిరక్క - ఆడది తిరిగీ చెడ్డదని తప్పు చెప్పారు గానీ. నిజానికి ఆడది తిరక్క - మగాడు తిరిగి చెడ్ఠారు.

ఉద్యోగం స్త్రీ లక్షణం - కావాలంటే నిశితంగా చూడండి సివంగి వేటాడి మాంసం తెస్తే సింహం తింటుంది గానీ దానంతట అది స్వతహాగా వేటకి వెళ్ళదు .. డౌటున్నోళ్ళు డిస్కవరీ చానెళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవండి...

అలాగే... మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది గానీ - ఆడ నెమలికి అంత పెద్ద తోక నెమలి కన్నులూ ఉండవు. దీనర్ధం క్లాసికల్ డాన్సులు కూడా మగవారివే...

అలాగే వంట పని ఇంటి పని కూడా మగవాడిదే ... మాయ చేసి ఆడవారు లాగేసుకున్నారు..

పురాణాల్లో వంటలని నలభీమ పాకాలన్నారు గానీ - ద్రౌపదీ - దమయంతి పాకాలన్నారా...??

ఎక్కడో చరిత్ర వక్రీకరణ జరిగి మగాళ్ళకి ఉద్యోగాలు చేసే ఖర్మ పట్టింది గానీ - లేకుంటే కుదురుగా ఇంటిలో కూర్చుని హాయిగా వంటే చేస్కునేవాడు...!!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!