లాలా అమర్‌నాథ్ !

 లాలా అమర్‌నాథ్ !

1933 డిసెంబర్ 15 న తొలి టెస్ట్ ఆడుతూ సెంచరీ సాధించాడు. 

అది టెస్ట్ క్రికెట్ లో భారతీయుడు సాధించిన తొలి శతకం. 

తొలి టెస్ట్ లోనే శతకం సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. 1952 డిసెంబర్ వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్‌నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించాడు. 

ఇందులో ఒక శతకం మరియు 4 అర్థ శతకాలున్నాయి. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేసి 45 వికెట్లు కూడా పడగొట్టాడు. 

డొనాల్డ్ బ్రాడ్‌మెన్ ను హిట్ వికెట్ ద్వారా ఔట్ చేసి అతనిని ఆ విధంగా ఔట్ చేసిన ఏకైక బౌలర్ గా నిల్చినాడు. 

అతను రెండు పర్యాయాలు టెస్ట్ సీరీస్ లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. పటౌడీ సీనియర్ తర్వాత ఒకసారి, విజయ్ హజారే తర్వాత మరోసారి నాయకత్వ పగ్గాలు చేపట్టాడు. 

తొలిసారిగా పాకిస్తాన్ ను టెస్ట్ సీరీస్ లో అతని నాయకత్వం లోనే భారత్ విజయం సాధించింది.


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.