చుప్పనాతి !

చుప్పనాతి !

.

చుప్పనాతి అంటే మోసం, కపటం, ఓర్వలేనితనం వంటి గుణాలున్న, కుటిలత్వం కలిగిన వ్యక్తిత్వంగా తెలుగు జాతీయంలో కనిపిస్తుంది.

ఈ జాతీయంలోని చుప్పనాతి అనే పదం శూర్పణఖ కి రూపాంతరంగా కనిపిస్తోంది..

శూర్పణఖ రామాయణంలోని ముఖ్యమైన పాత్ర. 

నిజానికి కర్ణుడు లేని భారతం లాగే శూర్పణఖ పాత్ర ప్రమేయంలేకపోతే రామరావణ యుద్ధమే లేదు. 

శూర్పణఖ రావణాసురుని చెల్లెలు. పంచవటిలో సీతారాములు ఉన్న చోటకి వచ్చి రాముడిని చూసి మోహించింది. రాముడు తనకు సీత ఉందని, లక్ష్మణుడిని వరించమని పంపించాడు. లక్ష్మణుడు శూర్పణఖ కు ముక్కు చెవులు కోసి అవమానించి పంపించాడు. ఆ అవమానానికి ప్రతీకారంగానే రావణాసురుడిలో సీతపైన కోరిక పుట్టేలా, రాముడి పై శత్రుత్వం పెరిగేలా చేసింది. చివరకు దాని ఫలితంగా రామరావణ యుద్ధం జరిగి లంకకే చేటు తెచ్చింది. 

సీత సౌందర్యంపట్ల అసూయ, కోరినదాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే కాంక్ష, తనకు లేని సుఖం ఇతరులకు ఉంటే భరించలేని ఓర్వలేనితనం ఇవన్నీ శూర్పణఖ పాత్ర లోని లక్షణాలు.

ఈ శూర్పణఖ లక్షణాలు కొన్ని ఉన్నా అటువంటివారిని చుప్పనాతి శూర్పణఖ అంటూ చెప్పడం తెలుగు జాతీయంగా మారింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!