పోట్లాడాలి ..గట్టిగా పోట్లాడాలి .

Lakshmi Vasanta

పోట్లాడాలి ..గట్టిగా పోట్లాడాలి ..అని అనుకుంటాను కానీ ..

ఇంట్లో ..మటుకు ,పిలవకుండా వచ్చే అతిథి ..ఈ నెత్తి మీద నాకు తెలియకుండా మోసే చిల్లులు పడిన కుండ ..ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ..

అన్నం గ్లాసు లో పోసి తాగాల్సి వచ్చినా ..ఇప్పుడేమయింది ? కొంచం ముద్ద అయింది ..అంతేగా ? 

కూర లో ఉప్పు ఎక్కువై పోయింది ...బి పి ఎక్కువై , కంచం విసిరేస్తారా ? అనుకునే నేను ..

ఫర్వాలేదు ..ఇవాల్టికి .ఇలా తినేస్తాను ..రేపటినుండి ..అని కోపం దిగ మింగుకునే భర్త ..

ఫోం బిల్లు ఏమిటి వందలు దాటి ...వేలు ..వేలు అయిపోతోంది అంటూ ప్రశాంతం గా చెప్పే అతను ..

సరే ,సరే ఇక నించి రోజూ కదు .రెండ్రోజులకి ఒక సారి కాల్ చేస్తాలే ..

ఇన్ని చీరలు ..బీరువాలు నిండి పోయాయి ...పాత వి ,ఎవరికి ఐనా ఇచ్చేసి ,పోనీ కొత్తవి కొనుక్కో ..

నగలా ? ఉన్నవే లాకర్ లో మగ్గుతున్నాయి ..ఐనా చూద్దాం లే ..హుహ్ ..

కోపమే రాదా ?? నా కుండ ఎప్పుడో ...ఈ మధ్య లో ఎండి పోయింది ..

ఇది ఒక రోజు లో ..జరిగేది కాదు ..ముప్ప్హై ఏళ్ళ సహ జీవన సౌరభం ..ఫలితం ఇది ..

ఒకరి మనసులో ఒక ఆలోచన పుట్టక ముందే మరొకరికి తెలిసి పోతుంది ..

ఒకరి సంతోషం మరొకరి ఆశయం అయిపోతుంది ..

ఒకరి కాలి కి ముల్లు గుచ్చుకుంటే ,మరొకరికి కళ్ళల్లొ నీళ్ళు వస్తాయి ..

ఇది క్రమేపి ,ఒకరి నొకరు అర్ధం చేసుకోవడం వల్ల .. సంకూరుతుంది ..

ఎక్కడో చదివాను ..సుధీర్ఘ కాలం కలిసి జీవించిన వారి మొహాలు కూడా ఒక్క లాగే అయిపోతాయి ..

పండు ముసలి వారి ముఖాలు చూడండి ..ముడతల తో ఎంత అందం గా ఉంటాయో ..ఒక్క లాగే అనిపిస్తాయి ..ఇరువురి మొహాలు ..భార్య భర్తల వి ..

ఇంతకీ చెప్పోచ్చేది ఏమిటంటె ..

నేను నేను లా ఉండడానికి ,నన్ను నన్ను గా స్వీకరించడానికి ..చాలా ..ముప్ఫై ఏళ్ళు ఐనా పట్ట వచ్చు ..

అందుకే వివాహం అయిన మర్నాడి నించి ..నన్ను అర్ధం చేసుకోలేదు అంటూ ..బాధ పడకండి ..

ఎవరూ .. మరొకరి ని పూర్తిగా అర్ధం చేసుకోరు ..కొంత ఆకర్షణ , కొంత ప్రేమ ..వీటి మోజు లో పడి పోయే పెళ్ళి చేసుకుంటారు ..

మన ( ఆడ వారు ) లో మరొక వీక్ నెస్స్ ..పెళ్ళి అయిన మర్నాటి నించి ..వారు మనలో ఉన్న అన్ని మాటలు అర్ధం చేసుకుంటారు అని అనుకుని. మౌనంగా ఎదురు చూస్తాం ..

కానీ ,నువ్వు బయటకి నోరు విప్పి చెపితే కానీ అర్ధం కాదు ..ఆఖరికి , నీ వడలి పోయిన మొహం చూసి ,నీకు ఆకలి వేస్తోంది అని కూడా గమనించలేరు ..ఈ మగ వాళ్ళు ..కాబట్టి ..

నోరు విప్పి అన్నీ ..చెపుతూ ఉండాలి ..నాకు ఇది కావాలి ,నాకు నీ ఫలానా మాట బాధ కలిగించింది అంటూ ..బాధ పడుతూ మౌనం గా కూర్చుంటే ,పని జరగదు ..

ఇవి ,నా అనుభవం తో నేను ..కొత్తగా పెళ్ళి అయిన వారికో ..మరి ఇంకా నూతం దంపతులు అని భావిస్తూ ,ఊహల ప్రపంచం లో విహరించే వారికి ..ఇచ్చే ..పండంటి సలహాలు ..పచ్చని కాపురానికి పండంటి సలహాలు ...ఉంటాను మరి ..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!