ఏమతం గొప్పది?

ఏమతం గొప్పది? By - Virabhadra Sastri Kalanadhabhatta


కవిపాదుషా బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పువ్వాడ శేషగిరిరావుగారు నాకు గురు తుల్యులు. 


ఒకసారి వారు క్లాసులో తెలుగు పాఠం చెప్తూవుండగా ఒకకుర్రాడు లేచి “మేష్టారూ! ఏ మతం గొప్పదండి?" అని అడిగాడు. 

రావుగారు ఇల్లా అన్నారు " ఇప్పుడు నేను ఒక చిన్న కధ చెప్తాను. " 


ఒక పల్లెలో ఒక రైతు, భార్య నివశిస్తున్నారు. ఒక రోజు అతని భార్య వంటచేసి, మూటకట్టుకొని పొలంలోకి తీసుకువచ్చి ఒక చెట్టునీడలో కూర్చొని, భర్తను భోజనానికి రమ్మని పిలిచింది. రైతు కాళ్ళూచేతులూ కడుక్కొని వచ్చి భార్య ముద్దలు చేసి పెట్తూవుంటే తింటున్నాడు. ఆమెకూడా భర్తకు ఒక ముద్ద పెట్టి తనో ముద్ద తింది. 


ఆతర్వాత కాస్సేపు భార్య తొడపైన తలపెట్టుకొని రైతు సేద తీర్చుకున్నాడు. అతని తలను గోముగా నిమురుతూ “ మామా! మనం చచ్చిపోయాక మళ్ళీ జన్మలో కూడా ఇలాగే భార్యాభర్తలలా పుట్టాలని వుంది. అలా పుట్టడానికి వీలవుతుందా?" అంది. 


దానికి రైతు “అవునే! నాకూ అలానే అనిపిస్తూవుంది. మళ్ళీ జన్మలోకూడా మనం భార్యా భర్తలలా పుట్తామంటావా? ఏమో! ఈ విషయం పంతులుగార్ని అడగాలి " అన్నాడు. 


“ఇప్పుడు చెప్పండి ఏమతం ఈ అనుబంధంలోని అమరత్వాన్ని నమ్మి చెప్పగలదు? ఆమతమే గొప్పది ? " అని శేషగిరిరావుగారు కధను ముగించారు. 


ఆలుమగల నిష్కళంకమైన అనురాగం , ఆత్మీయత నిండిన ప్రేమ నిజంగా అజరామరమే! ఏమతమైనా ఈ ప్రేమతత్వం లేకుండా వుంటుందా?


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!