బారు బారు

ఇతర ఏ భారతీయ భాషలోను కనపడని, తెలుగు బాల సాహిత్యం లో ఎదిగిన, ఒక విచిత్రమైన ప్రక్రియ తొక్కు పలుకులు.ఈ ప్రక్రియను తొలిసారిగా గృహలక్ష్మి మాసపత్రిక ఆదరించి ప్రోత్సహించింది. ఒక పదం చివర నొక్కి పునరక్తితో మరో పదం సృష్టించడం ద్వారా తొక్కుపలుకులు ఏర్పడతాయి. కొత్త పదాలు త్వరగా నేర్చుకోవడానికి, పలకడానికి తద్వార భాషా విఙ్ఞానం పెంచుకోవడానికి ఇవి ఎంతగానో వినియోగిస్తాయి. ఉత్సాహాన్ని కలిగిస్తాయి.


బారు బారు


ఏమి బారు – చీమల బారు


ఏమి చీమ – గండు చీమ


ఏమి గండు – పిల్లి గండు


ఏమి పిల్లి – నల్ల పిల్లి


ఏమి నల్ల – కారునల్ల


ఏమి కారు – పట్టుకారు


ఏమి పట్టు – నారపట్టు


ఏమి నార – గోగునార

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!