శివుడట శివమట

Sankisa Sankar

శివుడట 

శివమట

శివమంటె శుభమట

ఇదెక్కడి వింతో

ధూర్జటట,

అక్కడ 

అఘాంతక గంగట!

పాప పుణ్యాల 

మథనపు చలనోత్పత్తి

నెత్తినట!

జాలినిండిన

రెండు కనులట

ఇదెక్కడి వింతో ,

నుదుటిన నిప్పంటి 

మూడో కన్నట!!

శివమంటే శుభమట,

మరి మెడలో కాలనాగట!

మిత్తిని మ్రింగినాడట 

మరి మర్త్యులకెందుకీ

మరణ హేలట?!

శివుడట, శివమంటే శుభమట! 

కరమున పుఱ్ఱెట !

ఇదెక్కడి వింతో

యాచకుంజేతిన శూలమట!

వేషమట

వెఱ్ఱి నృత్యమట!

దిగంబరుడట,

కానీ అమ్మకి 

సగమిచ్చినాడట! 

ఇదెక్కడి వింతో

తిరిగేది శ్మశానమట 

కానీ ఊరంతా ముప్పది

ముక్కోటి సేవకగణమట!

శబ్దాలన్నీ 

వాడి రూపాలట,

పైగా వరదుడట,

ఇదెక్కడి వింతో,

వాడిచ్చేది

నిశ్శబ్దమట!

అవునులే 

నా అఙానంతో

నిరాకారమైన

శివమంటి శివుడికి

రూపమిస్తే

అంతేనట!


( శివుడంటె శివమే, శివమంటే శివుడే, వాడిచ్చేదంతా శుభమే!! నమః శివాయ)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!