"రామప్ప దేవాలయము" .

Venkatachary Rangoju వారి కవిత.

మి సరస్సు ! లేమి గిరు ! లేమి ధరాజము ! లేమి లోయ ! ల 

వ్వేమి జలప్రవాహములు ! నేమి కళాత్మక కట్టడాల్ ! విధం 

బేమని వర్ణనల్ సలుప, నేమి రచించెదఁ వాటి గూ ? ర్చహో ! 

రామపదేవళమ్మనినఁ, లక్నవరమ్మనినన్ గనన్వలెన్ !!


ఎక్కడైనా ఒక దేవాలయం ఉందంటే అది అందులో ప్రతిష్ఠింపబడిన దైవము పేరుతోనో, భక్తుడి పేరుతోనో, కట్టించినవారి పేరుతోనో లేదా ఆ ప్రాంతము పేరుతోనో ప్రసిద్ధికెక్కుతుంది. కానీ ఇక్కడి దేవాలయము అవేమీ కాకుండా, దానిని నిర్మించిన శిల్పిబ్రహ్మ అయిన "రామప్ప" పేరుతో "రామప్ప దేవాలయము" అని పిలువబడుతున్నది. అసలు పేరు "రామలింగేశ్వరాలయము", "రుద్రేశ్వరాలయము". అందున్న దైవము శివుడు. ఈ దేవాలము మరియు చెరువు కాకతీయుల కాలం నాడు నిర్మింపబడినవి. 

క్రీ.శ. 900 సం||లోనే కాకతీయ సామ్రాజ్య స్థాపనకు పునాదులు నిర్మింపబడ్డాయి. దీనికి ఆద్యుడు "వెన్నరాజు". ఈతని మునిమనుమడు "ముమ్మడి గుండన" (900-912) చిన్న రాజ్యముగా ఏర్పరచి పాలించాడు. తరువాత కాలంలో వీరి వంశం వారు ప్రక్కనున్న రాజ్యాలను జయిస్తూ, కొన్నిటిని సామంత రాజ్యాలుగా మార్చుకుంటూ మహాసామ్రాజ్యంగా విస్తరింపజేసారు. వీరిలో ముఖ్యులైనవారు బేతరాజు, గణపతిదేవ చక్రవర్తి, ఈయన కూతురు రుద్రమదేవి (1262-1291), ఈమె మనుమడు ప్రతాపరుద్రుడు (1291-1323). ఇంకా కొందరు ఉన్నారు కానీ, ఇప్పుడు అప్రస్తుతమనిపించి వ్రాయడంలేదు. క్రీ.శ. 900 నుండి చిన్న రాజ్యంగా మొదలై క్రీ.శ. 1200 వరకు మాహా సామ్రాజ్యముగా విస్తరించి, 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆధ్వర్యంలో జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు పట్టుబడి, ఆ అవమానాన్ని భరించలేక అతడు "నర్మదానది" లో పడి ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయసామ్రాజ్యము పతనం అయింది. 


గణపతిదేవుడు (1198-1262) తన పాలనలో ప్రజాసంక్షేమమే కాకుండా, రాజ్యవిస్తరణ కూడ పాలనలో భాగంగానే చేసాడు. ఇతడు ఇతని పూర్వీకుల వలె కాకుండా ప్రక్కనున్న రాజ్యాలవారితో వియ్యాలందుకొనడం ద్వారా, వారిని సామంతులుగా మార్చుకొనడం ద్వారా, కొంతమంది (వినని వారు) రాజులను జయించడం ద్వారా రాజ్యవిస్తరణ చేసాడు. ఈయన కాలంలోనే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇంకా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఒకే మహాసామ్రాజ్యంగా ఏర్పడింది, గణపతిదేవుడు చక్రవర్తి అనిపించుకున్నాడు. ఈ చక్రవర్తి కాలంలోనే ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొండపర్తి, నాగులపాడు మొదలైన స్థలాల్లో ఆలయాలు వెలసాయి. పిల్లలమర్రిలో ఎరకేశ్వరాలయము, నామేశ్వరాలయము అప్పుడే నిర్మింపబడ్డాయి. ఇక్కడ నాటి చిత్రలేఖనములు కూడా ఉన్నాయి. 


ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వరాలయము, పద్మాక్షి ఆలయం, స్వయంభూ ఆలయం, కేశవాలయం నిర్మింపబడ్డాయి. రుద్రదేవుని పాలనాకాలంలో హనుమకొండలో వేయిస్తంభాలగుడి (త్రికూటాలయము - శివ, విష్ణు, సూర్య అని మూడు గోపురాలుంటాయి) నిర్మింపబడింది. కాకతీయ రాజ్య రాజధాని మొదట "కొరవి" పట్టణము (ఎక్కడుందో తెలియదు) కాగా, తరువాత కాలంలో హనుమకొండ, ఓరుగల్లు పట్టణాలకు మార్చబడ్డాయి. కాకతీయులకు రాజ్యం పెరుగుతున్నాకొద్ది రేచర్లవారు సేనానులుగా ఉండసాగారు. గణపతిదేవ చక్రవర్తికి సేనాని అయిన "రేచర్ల రుద్రుడు" పాలంపేటలోని రామప్ప దేవాలయ నిర్మాణానికి కారకుడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!