నందితిమ్మన్నను ముక్కుతిమ్మన్న అని ఎందుకు అన్నారు

నందితిమ్మన్నను ముక్కుతిమ్మన్న అని ఎందుకు అన్నారు అంటే దానికి ఒక ముచ్చట చెప్తారు. ఒకనాడు తనకు క్షౌరం చక్కగా చేసినందుకు సంతోషించి తిమ్మన్న మంగలికి బహుమతి ఇవ్వబోవగా, వాడు కవిగారూ నాకు డబ్బు వద్దు, మంచి పద్యం ఏదైనా వ్రాసి ఇవ్వండి అన్నాడుట. తిమ్మన్న సంతోషించి డబ్బుతోకూడ ఈక్రింది పద్యం ముక్కు మీద వ్రాసి ఇచ్చారుట. 

నానాసూన వితాన వాసనల నానందించు సారంగ మే 

లానన్నొల్లదటంచు గంధఫలి బల్ కానందవంబంది, యో 

షా నాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్య సంవాసియై 

పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్

ఒకనాడు భట్టుమూర్తి ఈపద్యం విని మహదానందంతో వాడికి చాలా ధనం ఇచ్చి కొనుక్కున్నాడని, తర్వాత తన వసుచరిత్రలో దానిని చేర్చుకున్నారని అంటారు. ఇంత ప్రఖ్యాతిపొందిన ముక్కు పద్యం వ్రాసిన కవి కాబట్టి ఇతడు ముక్కు తిమ్మన్న అయిపోయాడంటారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!