“వీణాపుస్తక పాణి”


సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న కాళిదాసుకి “వీణాపుస్తక పాణి” ఎప్పుడు 

పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై పలకరిస్తుందిట. ఒకరోజు చదువుల తల్లి తన వద్దకి వచ్చినపుడు కాళిదాసు ఇలాప్రశ్నిస్తాడు? “అమ్మా! ఇప్పుడున్న కవి,పండితులలో కవి ఎవరు? పండితుడు ఎవరు?అని.” అపుడు సరస్వతి ఇలా అంటుంది. 

“కవిర్దండీ కవిర్డండీ భావభూతిస్తు పండితః”

అని శ్లోకపాదం చెప్పిందట. అనగా సంస్కృతంలో దశకుమార చరిత్రం అనే గొప్ప కావ్యాన్నివ్రాసిన దండి అనేవాడే మహాకవి అనుటలో సందేహం లేదు, అని తెలపడానికే రెండు పర్యాయాలు “కవిర్దండీ కవిర్దండీ” అనిపలికి, ఉత్తరరామ చరితం వంటి మహోన్నతమైన నాటకాలు వ్రాసిన భవభూతిని మహాపండితుడు అని వాగ్దేవి చెప్పిందట.

అప్పుడు కాళిదాసుకి చాలకోపంవచ్చిందట. కారణం తనని కవి అనికాని,పండితుడని కాని గుర్తించలేదని. లోకంలో కవులు,పండితులేకదా! ఉండేది. తాను ఏ కోవకి చెందని వాడనా అని. వెంటనే “కోహం – -(తరువాతి పదం ఒక తిట్టు.అందుకని పేర్కొన లేదు.) ఓ – నేనెవరిని ? అని గట్టిగా అడిగేడట.

పిల్లల కోపాన్ని తల్లి సహించి బుజ్జగిస్తుంది కదా! అందుకే వెంటనే అమ్మ ---

“త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః.” 

అనగా నీవేనేను, నీవేనేను, నీవేనేను సందేహమేలేదు. అని నొక్కి వక్కాణించిందట. సాక్షాత్ సరస్వతి స్వరూపమే కాళిదాసు అనుటలో సందేహమేలేదు.అని ఆ చదువుల తల్లి స్వయంగా తెలిపింది.

అందుకే “కవిలోకానికే గురువు కాళిదాసు. అట్టి కాళిదాసు పుట్టిన భూమిపై పుట్టిన మనం ధన్యులం.

Comments

  1. Entha adbhutam ga varnana chesaru👏👏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!