ఇదండీ మకర సంక్రాంతి విశేషం

అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. అందులో సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూర్య్డు ఒక్కో రాశిలో నెలరోజులా పాటు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనూసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. నిజానికి సూర్యుడు ఎప్పుడు తన స్థానంలోనే ఉంటాడు. ఈ విషయం ఆధునికసైన్సు చెప్పక కొన్ని వేల ఏళ్ళ పూర్వమే హిందువులకు తెలుసు. శథపధ బ్రాహ్మణం 'నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన, పగలు రాత్రి ఏర్పడుతున్నాయి' అంటూ చాలా స్పష్టంగా చెప్పింది. ఏడాదిలో 12 సంక్రాంతులు ముఖ్యమే అయినా, అందులో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం ప్రధానమైనవి. మకరసంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తరాయణంలో భూమికి సూర్యునికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణం దేవతలకు పగలు. ఈ కాలంలోనే ఎన్నో శుభకార్యాలు చేస్తారు. ఈ ఉత్తరాయణం ఈ మకరసంక్రమణంతోనే మొదలవడంతో ఇది పెద్ద పండుగ, ముఖ్యంగా సూర్యునికి సంబంధించిన పండుగ. సంక్రాంతులలో పితృదేవతలను పూజించాలి, వారికి తర్పణాలు వదలాలి. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి, సంతానం వృద్ధిలోకి వస్తుంది.
ఇదండీ మకర సంక్రాంతి విశేషం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!