పాత పద్యాలకు క్రొత్త పేరడిలు....

పాత పద్యాలకు క్రొత్త పేరడిలు.....

అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై

నరుపై ద్రౌపదిపై కుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై

పరగం గల్గు భవత్కృపారసము నాపై కొంత రానిమ్ము నీ

చరణాబ్జంబుల నమ్మినాను జగదీశా! కృష్ణ! భక్తప్రియా!


అన్న సుప్రసిద్ధ పద్యం చాలామందికి తెలిసినదే. ఈపద్యం తిక్కన్న వ్రాసినదిగా కొందరు, వెన్నెలంటి జన్నయ వ్రాసిన దేవకీనందన శతకములోనిదని కొందరు పేర్కొన్నారు. వ్రాసినది ఎవరైనా ఈ పద్యానికి అత్యదికమైన పేరడీలున్నాయి. కొన్ని చూద్దాం.


1. వడపై, నవడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియోం

పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్ బోండాపయిన్ సేమియా

సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే

నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!

(అబ్బూరి రామకృష్ణారావు గారి పేరడి)


2. ఉపమాపై పెసరట్టుపై యిడిలిపై హుమ్మంచు చూపించు నీ

జపసంబద్ధ పరాక్రమ క్రమ కటక్షశ్రేణి మన్నించు శు

భ్రపు జిల్లేబి పకోడి లడ్వగయిరాపై కొంత రానిమ్ము శ్రీ

చపలాంగ సితాంగ నా హృదయపాశాపూజ్యవస్తుప్రియా

(అబ్బూరి రామకృష్ణారావు గారి పేరడి)


3. అరయన్ మారుతపుత్రునిపై శబరిపై నాహల్యపై కైకపై

వరసుగ్రీవునిపై సదాగుహునిపై వాసిష్ట మౌనీంద్రుపై

కరమొప్పారగ రావణానుజునిపై కంజక్షియౌసీతపై

పరగన్ గల్గు భవత్కృపారసము నాపై జూపుమో శ్రీహరీ!

(అజ్ఞాత కవి చాతువు)


4. అరయన్ పార్థునిపై మృకండుసుతుపై నబ్జారిపై బానుపై

కరిపై శ్రీపయి భిల్లవంశపతియౌ కన్నప్పపై కాళుపై

పరగంగల్గు కృపారసంబిపుడు నాపై జూప నీ నాధుతో

కరుణావరధి తెల్పరాదె జననీ జ్ఞానప్రసూనాంబికా!

(జ్ఞానప్రసూనాంబిక శతకము నుండి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!