కలవారికోడలు కలికి కామాక్షి

కలవారికోడలు 

కలవారికోడలు కలికి కామాక్షి 

కడుగుచున్నది పప్పు కడవలో పోసి 

అప్పుడే వచ్చేను ఆమె పెద్దన్న 

కాళ్ళకు నీ ళ్లి చ్చి కన్నీల్లు నింపె 

ఎందుకీ కన్నీళ్ళు ఏమి కష్టాలు 

తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు 

ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము 

చేరి మీ వారితో చెప్పిరావమ్మ 

పట్టె మంచం మీద పడుకున్న మామా 

మా అన్నలోచ్చారు మమ్మం పుతారా 

నేనెరుగ నేనెరుగ మీ అత్త నడుగు 

పట్టె మంచం మీద కూర్చున్న ఓ అత్తా 

మాఅన్నలోచ్చారు మమ్మం పుతారా 

నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు 

భారతం చదివేటి ఓ బావా 

మా అన్నలోచ్చారు మమ్మం పుతారా 

నేనెరుగ నేనెరుగ మీ అక్కనడుగు 

వంట చేసే తల్లి ఓ అక్కగారు 

మా అన్నలోచ్చారు మమ్మం పుతారా 

నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు 

రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి 

మా అన్నలోచ్చారు మమ్మం పుతారా 

పెట్టుకో సొమ్ములు కట్టుకో చీరే 

పోయి రా సుఖముగా పుట్టినింటికి ...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!