దత్తపది ----------------------------(Virabhadra Sastri Kalanadhabhatta.)

దత్తపది ----------------------------(Virabhadra Sastri Kalanadhabhatta.)


భక్తి


ఆరోజు ఏకాదశి..మహాపర్వదినం 

దేవాలయంలో స్వామికి వజ్రకిరీట ధారణ 

తండోపతండాలుగా జనసందోహం 

ఇసుకవేస్తే రాలడంలేదు 


రక్తి


పౌరాణిక సినిమాల్లో దేవిగా నటించిన 

ప్రఖ్యాత నటీమణి ధరించిన కిరీటం 

ఆరోజు వేలానికి వచ్చింది 

వేలం వెర్రిగా వేలం పాట సాగుతోంది 

చివరకి ఆ గిల్టు కిరీటాన్ని 

లక్షా ఏభైవేలకి ఒక వీరాభిమాని స్వంతం అయింది 

అది దక్కని మిగిలిన అభిమానులు నిరాశతో వెనక్కి 

అయ్యో ఈసొమ్మూతో వరదలో కూలిపోయిన ఇళ్ళు బాగుచేయించుకోవచ్చుగదా 

వరద భాదితుల ఆవేదన


ముక్తి


మధ్య తరగతి కుటుంబం 

వున్న అన్నం కాస్తా పిల్లలకు సహం కడుపేనింపింది 

కాస్త కాఫీ తాగి భర్త ఆఫీసుకు వెళ్ళాడు 

సాయంత్రం వచ్చేటప్పుడు ఎక్కడైనా అప్పు తెస్తానని 

ముసలి అత్త మామలు, తనూ మిగిలారు 

బిక్కు బిక్కు మంటూ చూస్తున్న కోడలని చూసి అత్త అంది 

ఈవేళ ఏకాదశి కదమ్మా! 

వుపవాసం వుంటే పుణ్యం కదా! 

నిజమే వంటికి ఆరోగ్యం.. ముక్తికి ముక్తీను



విరక్తి



ఛీ !! ఇక రాజకీయాలనుండి తప్పుకోవాలి 

(గోడమీద బాపూ పెదవులపై మందహాసం) 

ఇంతలో ఫోను 

అవతల సి.యం 

హలొ! నీర్సంగా పలికాడు వోడిన నాయకుడు 

ఏమిటయ్యా! అల్లదిగాలుపడిపోయావు 

ఓడిపోయినందుకే?? 

ఇక్కడ వోడిపోతే మాత్రం 

శాసన మండలి వుందికదయ్యా! 

ఓ పదిలక్షలు నీవి కావనుకో! 


విరక్తిపై విరక్తి కలిగింది 

మళ్ళీ ఆశ చిగుర్చింది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!