శ్రీకాళహస్తీశ్వర శతకము.......(ధూర్జటి)

శ్రీకాళహస్తీశ్వర శతకము.......(ధూర్జటి)


వాణీనల్లభ దుర్లభంబగు భవ / ద్వారంబునన్నిల్చి,ని

ర్వాణశ్రీ చెరపట్టచూచిన విచా / రద్రోహమో,నిత్య క

ళ్యాణ క్రీడలబాసి,దుర్దశలపా / లై,రాజలోకాధమ

శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో / శ్రీకాళహస్తీశ్వరా!


శ్రీకాళాహస్తీశ్వరా!సరస్వతీ దేవికి భర్తయగు బ్రహ్మదేవునకు కూడ అసాద్యమైన నీ వాకిటిలోనిల్చి,మోక్షమనే లక్ష్మీదేవిని పొందాలని కోరుకోటం నేను చేసిన చెడుపని అని నీవు భావించితివి.కాకపోతే నిత్యమూ శుభకరములైన పనులను చేసే నేను వానికి దూరమై,చెడుగతుల పాలిట బడిపోయి,అతితక్కువ శ్రేణికి చెందిన రాజులయొక్క ద్వారముల వద్ద ఉండునట్లుగా చేసితివి.కనుక నాతప్పు మన్నించుము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!