చిన్నప్పుడు సంవత్సరమంటే…


 
చిన్నప్పుడు సంవత్సరమంటే… సంంంంంంంంంంంంవత్సరంలా ఉండేది.

ఇప్పుడంటే కొంచెం ఏమారితే చాలు, సంవత్సరాలు, నెలలూ తిరగబడిపోతున్నాయ్.

మొన్ననే మన ముందే ఏడుస్తూ పుట్టిన పిల్లల్ని నేడు పలకరిస్తే “ఇంజనీరింగ్ చదువుతున్నాను అంకుల్” అని అంటున్నారు…తేడా ఎక్కడుంది?

భూమేమైనా సూర్యుడి చుట్టూ తిరిగే వేగం హెచ్చించిందా?

మనమే మంచు భల్లూకాల్లా ఆరునెలలు మనకు తెలియకుండానే హైబర్నెషన్‌లోకి వెళ్ళిపోతున్నామా? లేదా తేడా మన వయస్సు ..భాధ్యతలలో ఉందా .. ఏం జరుగుతోంది…..నాకు తెలియాలి. Y2K సమస్య పోయిన సంవత్సరంలో వచ్చినట్లు ఉంది… చూస్తే దశాబ్దం గడిచిపోయింది. మొత్తానికి జీవితం 8x వేగంతో ఫాస్ట్ పార్వర్డ్‌లో చూస్తూన్న సినిమాలా జరిగిపోతోంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!