అన్నమయ్య కీర్తన.. కులుకక నడవరో...

అన్నమయ్య కీర్తన..

కులుకక నడవరో


కులుకక నడవరో కొమ్ములాలా 

జలజల రాలీని జాజులు మాయమ్మకు


ఒయ్యనే మేను కదలీ నొప్పుగా నడవరో

గయ్యాళి శ్రీ పాదతాకు కాంతలాలా

పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బలమీద

అయ్యో చెమరించె మాయమ్మకు నెన్నుదురు||


చల్లెడి గందవొడి మైజారీ నిలువరో

పల్లకి వట్టిన ముద్దు పణతులాలా

మొలమైన కుందనపు ముత్యాల కుచ్చులదర

గల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు


జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో

రమణికి మణుల ఆరతు లెత్తరో

అమరించి కౌగిట అలమేలుమంగ నిదె

సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు||


అలమేల్మంగమ్మ పల్లకిలో కూర్చున్నది. పల్లకిని మోసే ముద్దుగుమ్మలను అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు. ఓ భామలారా! ఒయ్యారంగా కులుకుతూ నడవకండే! అమ్మ నెరులు చెదరి విరులు జలజలా రాలిపోతున్నాయి, నుదురు చెమరిస్తుంది. పాపటలో జల్లిన గంధపొడి శరీరమంతా జారుతున్నది. జడకు గల ముత్యాల కుచ్చులు అదురుతున్నవి. కర కంకణాలు కదిలిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నడవండే! అమ్మ పల్లకి దిగినది. దిగిన వెంటనే ముత్యాల పాదరక్షలు అందించండే! మణుల హారతి పట్టండే! అంటూ చెలికత్తెలను అమ్మవారి సేవకు పురమాయిస్తున్నాడన్నమయ్య!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!