సీతమ్మ విలాపం-త్రిజటస్వప్నం !

సీతమ్మ విలాపం-త్రిజటస్వప్నం !

-

సీతమ్మ ’ దైన్య చిత్తయై హనుమంతుడు కూర్చుని ఉన్న


అశోకవృక్షం కిందికి పోయి రాముణ్ణి తలచుకుంటూ దు:ఖిస్తూ నిలబడింది. 

తన దుర్గతినంతా తలచుకొంటూ రోదించింది. అయ్యో! నాగుండె ఎంత


గట్టిది! అది ఎందుకు పగిలిపోదు? అని నేలమీద పడిపోయి పొర్లుతూ


ఆడు గుర్రపు పిల్లలాగా ఆమె ఆక్రందించింది.


అక్కడున్న క్రూరచిత్తులైన ఆ రాక్షసాంగనల్తో ’నన్ను చంపండి,


చీల్చండి, చిత్రవధ చేయండి. ఇక ఈ దు:ఖాన్ని నేను భరించలేను.


సహించలేను’ అని అంగ లార్చింది. అయ్యో రాముడు ఎంత


దివ్యపరాక్రముడు! జనస్థానంలో రాక్షసుడనేవాడు లేకుండా చేశాడే,


ఆయనెందుకు నన్ను రక్షించడంలేదు? అని సీత కుమిలి కుమిలి


ఆక్రోశించింది.


త్రిజటా స్వప్నం


రాక్షసులంతా ఆమెను హృదయవిదారకంగా భయపెడుతూ బెదిరిస్తూ


ఉండగా ఆ రాక్షససమూహంలోనే వృద్దురాలు, త్రిజట అనే ఒక రాక్షసి


’సీతాదేవిని అట్లా భయపెట్టవద్దనీ, అది వాళ్ళకు చెరుపుచేస్తుందనీ


లంకకు చేటు మూఢే కాలం అచిరకాలంలోనే సంభవించనున్నదనీ,


తనకు రాత్రి ఒక కల వచ్చిందనీ, ఆ కల సీతాదేవికి సమస్త్శుభాలు


చేకూర్చనున్నదనీ, రావణుడికి భయంకరమైన వినాశాన్ని


సూచిస్తున్నదనీ, తనకు వచ్చిన కల స్వరూపస్వభావాలు


రాక్షసాంగనలు కళ్ళకు తట్టినట్లుగా చెప్పింది.


నాలుగు దంతాలు గల గొప్ప తెల్లటి ఏనుగుపై కూర్చుండి సీతాదేవి


సర్వాలంకార భూషితురాలై, మంగళకరమైన స్వరూపంతో, పరమ


సంతోషంతో వెళుతూ ఉండటం చూశాననీ, ఆమె సూర్యమండలాన్నీ,


చంద్ర మండలాన్నీ చేతులతో తాకుతూ సర్వదేవతాగణాలు


సంతోషంగా స్తోత్రాలు చేస్తూ ఉండగా ఆ ఏనుగు మీద వెళ్ళుతూ ఉండడం


చూశాననీ, చెప్పింది త్రిజట. ఏనుగు దంతాలలో నిర్మితమైన


వేయిహంసలు మోసుకు వచ్చిన ఒక దివ్యమైన శిబికలో


రామలక్ష్మణులు రావడం, శ్వేతపర్వతం మీద సర్వాలంకారశీభితయైన


సీతాదేవిని పల్లకిలో రాముడు తీసుకొని పోవడం తాను కలలో


చూశానని త్రిజట చెప్పింది.


ఇక రావణుడు గాడిదపై వంటినిండా నూనె కారుతుండగా, మద్యంతో


కైపు ఎక్కి దక్షిణం వైపు వెళుతుండటం తాను కలగన్నట్లు త్రిజట


చెప్పింది. ఇంకా ఆ గాడిద మీద నుంచి రావణుడు విభ్రాంతుడై నేలమీద


పడిపోవటం, మళ్ళీ గాడిదలు పూన్చిన రథంపై నల్లని బట్టలు ధరిచి


దక్షిణదిశగా వెళ్ళడం చూసినట్లు త్రిజట చెప్పింది. ఎర్రటిచీర


కట్టుకున్న నల్లని స్త్రీ రావణుణ్ణి నేలమీద పడవేసి దక్షిణదిశకు లాగుకొని


పోతున్నట్లు చూశానని చెప్పింది.


రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తూ వరాహాన్నీ, ఒంటెనూ, మొసలినీ


ఎక్కి దక్షిణదిశకు పోవడం తనకు కనపడిదని త్రిజట చెప్పింది.


తెల్లటి పుష్పహారాలతో, తెల్లటి వస్త్రాలతో, తెల్లటి గంధంతో,


విభీషణుడు ఏనుగునెక్కి ఊరేగడం తాను చూసినట్లు చెప్పింది.


రాక్షసులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధంలో మరణించినట్లు తాను


కలలో చూశానని చెప్పింది. విభీషణుడికి శ్వేతచ్ఛత్రమూ,


వింజామరలతో రాజలాంఛనగౌరవం కలిగినట్లు తాను చూశానని


చెప్పింది.


సీతను క్రూరంగా భయపెట్టవద్దనీ, హింసించవద్దనీ త్రిజట ఆమె చుట్టూ


గుమిగూడిన భయంకర రాక్షసాంగనలకు హితవు బోధించింది.


త్రిజట చెపుతున్న ఈ మాటలన్నీ అశోకవృక్షమీద కూచుని ఉన్న


హనుమంతుడు విన్నాడు.

Comments

  1. Good afternoon
    its a nice information blog
    The one and only news website portal INS Media.
    please visit our website for more news updates..
    https://www.ins.media/

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!